- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‍లో దారుణం ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వర్టార్స్ లో ఉంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్రే భార్య దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం విగతజీవిగా పడి ఉన్న రంజన్‍రే భార్యను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రంజన్‍రే భార్యను పనిమనిషి హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని సీటీ సీపీ సజ్జనార్ పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



