Friday, May 8, 2026
E-PAPER
Homeజాతీయం‘ఎందుకు ఆశ్చర్యం.. ఇది బిజెపి సంస్కృతి`

‘ఎందుకు ఆశ్చర్యం.. ఇది బిజెపి సంస్కృతి`

- Advertisement -
  • ఎంపి మహువా మోయిత్రా

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ‘ఎందుకు ఆశ్చర్యం.. ఇది బిజెపి సంస్కృతి` అని ఎంపి మహువా మోయిత్రా పేర్కొన్నారు. రక్షణ పై పార్లమెంటరీ స్థాయి కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళుతుండగా, ఇండిగో విమానంలో కొందరు పురుషులు తనను వేధించారని తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపి మహువా మోయిత్రా గురువారం ఆరోపించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పెట్టిన ఒక పోస్ట్‌లో, ఇండిగో ఫ్లైట్ 6E 719లో ఈ సంఘటన జరిగిందని తృణమూల్ ఎంపి తెలిపారు. ” నేను ఈ రోజు అధికారిక పని మీద రక్షణ పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి ప్రయాణించాను. 6E 719 విమానంలో 1F సీటులో ఉన్నాను. నలుగురు-ఆరుగురు పురుషులు గుంపుగా విమానం ఎక్కి, నా వైపు అసభ్యంగా చూసి విమానం వెనుకకు వెళ్లిపోయారు.” అని మోయిత్రా ఒక వీడియోను పంచుకుంటూ పేర్కొన్నారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత, విమానం తలుపులు తెరుచుకోవడానికి ముందే, ఆ వ్యక్తులు తనను వేధించి, ఆ సంఘటనను చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. “ఇది ‘పౌర ఆగ్రహం’ కాదు. ఇది వేధింపు, విమానంలో నా భద్రతను ఉల్లంఘించడమే. విమానం లోపల ఈ దుండగులు ఇలాంటి వేధింపులతో ఏమాత్రం తప్పించుకోలేరు ” అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇండిగో, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపును ట్యాగ్ చేస్తూ …. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని మోయిత్రా కోరారు. “వారిని నో-ఫ్లై జాబితాలో చేర్చండి ” అని విమానయాన సంస్థను ఉద్దేశించి ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రెండవ పోస్ట్‌లో ఆమె, “ఇది బిజెపి సంస్కృతి. ఎవరైనా ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ?” అని అన్నారు. తాను ఆ సంఘటనను పట్టించుకోకుండా సమావేశానికి వెళ్లానని, అయితే ‘వైరల్’ అయిన వీడియోను చూసి దానిపై స్పందించాలని నిర్ణయించుకున్నానని మోయిత్రా వెల్లడించారు. ” నేను దాన్ని పట్టించుకోకుండా విమానాశ్రయం నుంచి నా సమావేశానికి వెళ్లాను. అప్పుడు సంఘీలు ‘వైరల్’ చేస్తున్న వీడియోను ప్రజలు నాకు ఫార్వార్డ్ చేశారు. అప్పుడే నేను దాని గురించి బయటపెట్టాను.” అని ఆమె పేర్కొన్నారు. తాను విమానయాన సంస్థకు అధికారిక ఫిర్యాదు పంపుతానని మోయిత్రా తెలిపారు. అయితే ఇండిగో లేదా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి తక్షణ స్పందన రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -