Saturday, May 9, 2026
E-PAPER
Homeసోపతినిదా ఖాన్‌ దోషా లేక బలిపశువా?

నిదా ఖాన్‌ దోషా లేక బలిపశువా?

- Advertisement -

టీసీఎస్‌ నాసిక్‌ కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగులు కొందరు తమతోటి ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తొమ్మిది ఎఫ్‌.ఐ.ఆర్‌లు నమోదయ్యాయి. మీడియా చర్చలో నిదా ఖాన్‌ పేరు ప్రధానంగా ముందుకు వచ్చింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం, నాసిక్‌ పోలిస్‌ కమీషనర్‌ విలేకర్ల సమావేశంలో చేసిన రిపోర్ట్‌ ప్రకారం నిదా ఖాన్‌ పేరు కేవలం ఒక ఫిర్యాదులో మాత్రమే ఉంది. అయినా దేశ వ్యాప్తంగా ఆమె పేరు పెద్ద సంచలనం అయింది.

నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (ుజూ) కేంద్రంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం, కార్పొరేట్‌ దుష్ప్రవర్తన కేసు పరిధిని దాటి, కార్పొరేట్‌ జిహాద్‌ పేరుతో మతపరమైన రంగు పులుముకుని, జాతీయ రాజకీయాల కూడలిలో చర్చనీయాంశంగా మారింది. జాతీయ భద్రతకే పెను ప్రమాదం ముంచుకొచ్చినంత స్థాయిలో జాతీయ చానల్స్‌, ప్రాంతీయ చానల్స్‌ చర్చోపచర్చలు జరిపాయి. కొన్ని చానల్స్‌ అయితే ఏకంగా జడ్జిమెంట్లు ఇచ్చేశాయి. ఇదే నాసిక్‌లో అశోక్‌ కరత్‌ అనే జ్యోతిష్కుడు 300 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడి వీడియోలు తీసినట్లుగా వార్తలు వెలుగులోకి వచ్చినప్పటికీ సంచలన వార్తగా భారత రాజకీయాల్లో చర్చనియాంశంగా లేదు. టీవీ డిబేట్లో చర్చలు లేవు. కానీ టిసిఎస్‌ కేసు ఏ కారణం చేత ఇంత సంచలనంగా మారుతున్నది. అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది.

కరోనా సందర్భంగా ఢిల్లీలోని తబ్లిగ్‌ జమాత్‌కు సంబంధించిన వ్యక్తులపై పెద్ద ఎత్తున కరోనా వ్యాపింప చేస్తున్నారని, కరోనా జిహాద్‌ అని మీడియా విస్తత ప్రచారం చేసింది. వారందరిని పెద్ద నేరస్తులుగా చిత్రించింది. అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు. తర్వాత వారు ఎలాంటి నేరానికి పాల్పడలేదని తేలాక సైలెంట్‌గా వదిలిపెట్టారు. మొన్న సమ్మక్క జాతరలో కోవాబన్‌ వివాదాన్ని సష్టించి ఫుడ్‌ జిహాద్‌ పేరుతో విస్తతంగా వికత ప్రచారం చేసారు. ఇప్పుడు టీసీఎస్‌ వివాదం. దీనికి కొత్తగా పెట్టిన పేరు కార్పొరేట్‌ జిహాద్‌. ఈ వివాదానికి కేంద్రబిందువు నిదాఖాన్‌. నిదా ఖాన్‌ మానవ వనరుల విభాగంలో భాగం కాదని, అలాగే ఏ అధికార పదవిలోనూ లేరని టీసీఎస్‌ స్పష్టం చేసింది. ఆమె ఒక జూనియర్‌ ఉద్యోగి, కేసుకు సంబంధించిన పత్రాల ఆధారాలు, సాక్ష్యాలు సూచిస్తున్నప్పటికీ, అవేవీ పట్టించుకోకుండా ఆమె పేరు మాత్రం వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది.

ఈ కేసులో అనేక ఆరోపణలు ఉన్నాయి. మార్చి 26 నుండి ఏప్రిల్‌ 3 మధ్య, ఎనిమిది మంది నిందితులపై తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిలో 2022 నుండి 2026 వరకు, అంటే గత కొన్నేండ్ల నాటి ఫిర్యాదుల వివరాలు ఉన్నాయి. ఈ ఫిర్యాదులలో పేర్కొన్న ఆరోపణలలో లైంగిక వేధింపులు, అవాంఛిత శారీరక స్పర్శ, వెంటపడటం, మానసిక వేధింపులు, మతపరమైన బలవంతం వంటి ఉదంతాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక సెక్షన్‌ తర్వాత జోడింపబడింది. ఎన్‌ఐఏ నాసిక్‌ కోర్టుకు సమర్పించిన దాంట్లో ఫుడ్‌ పాయిజన్‌ సంబంధించిన అంశాన్ని కూడా కొత్తగా చేర్చింది. వీటన్నింటినీ కలిపి చూస్తే, కంపెనీచే నియంత్రించ బడవలసిన వత్తి పరమైన సమస్యలుగా ఉన్నాయి. అందరూ కలిసి పనిచేసే చోట ఇలాంటి ప్రవర్తనకు అవకాశం ఉందని సూచిస్తున్నాయి. వాటిని నియంత్రించడం కోసమే కంపెనీలలో పోస్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఈ కేసులో ఆరోపణల పరిధి విస్తరిస్తున్న కొద్దీ, ప్రజల దష్టి ఒక్క వ్యక్తి చుట్టూనే కేంద్రీకతమైంది. నిదా ఖాన్‌ను ఒక హెచ్‌ఆర్‌ అధికారిగా, నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా, కొన్ని మీడియా సంస్థలైతే కుట్రదారుగా కూడా చిత్రీకరించాయి. అయితే, మరింత సమాచారం ప్రజల్లోకి రావడంతో మీడియా వండి వడ్డించే కథనాలు విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. నిదా ఖాన్‌ హెచ్‌ ఆర్‌ విభాగంలో భాగం కాదని, ఏ అధికార స్థానంలోనూ లేరని టీసీఎస్‌ స్పష్టం చేసింది. ఈ వివరాలు కేవలం పదాలకు సంబంధించిన విషయం కాదు. ఇది మొత్తం కేసులో ఆమె పాత్రను అంచనా వేయాల్సిన దక్కోణాన్ని మారుస్తుంది. డిసెంబర్‌ 2021లో కంపెనీలో చేరి, దాని దీూఉ విభాగంలో పనిచేసి, ఇటీవలే ముంబైకి మారిన ఒక యువ ఉద్యోగిగా నిదాఖాన్‌ ప్రొఫైల్‌ వెలుగులోకి వస్తోంది. గత ఏడాది వివాహం చేసుకోవడం, గర్భవతిగా ఉన్నట్లు వార్తలు రావడం, ఇప్పుడు ముందస్తు బెయిల్‌ కోరడం వంటి ఆమె వ్యక్తిగత పరిస్థితులు కూడా బహిరంగ చర్చలోకి వచ్చాయి. ఇది మొదట్లో ఆమెపై కఠినమైన నేరారోపణ కథనాలు ప్రచారం చేసిన వారికి, మీడియాకు ఇబ్బందికరంగా మారే ఒక మానవ కోణాన్ని జోడించాయి.

మరీ ముఖ్యంగా, ఎఫ్‌ఐఆర్‌లే స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయి. తొమ్మిది ఫిర్యాదులలో కేవలం ఒక్కదానిలోనే నిదాఖాన్‌ పేరు ఉంది. అందులో ఆమె హిందూ దేవతల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. ఈ ఆరోపణ తీవ్రమైనదే అయినప్పటికీ ఇది ఆరోపణే. నిరూపించ బడేంతవరకు ఆమె నిందితురాలు మాత్రమే. లైంగిక దాడి, బలవంతం చేయడం, మానసిక వేధింపులకు సంబంధించిన అత్యంత తీవ్రమైన ఆరోపణలు వివరంగా ఉన్న మిగిలిన ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లలో ఆమె పేరు లేదు.

ఫిర్యాదులన్నింటిలోనూ వేరొక వ్యక్తుల సమూహం పదేపదే గుర్తించబడింది, వారిపై వెంబడించడం (స్టాకింగ్‌), అసభ్య ప్రవర్తన నుండి మొదలుకొని భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మతపరమైన ఆచారాలను పాటించాలని ఒత్తిడి వరకు ఆరోపణలు ఉన్నాయి. ఈ తేడాను దర్యాప్తు అధికారులు కూడా గుర్తించారు. ఇప్పటివరకు ఇతర ఎఫ్‌ఐఆర్‌లతో సంబంధం ఉన్నట్లు నిదాఖాన్‌ పాత్ర వెలుగులోకి రాలేదని, అలాగే నిందితుల విస్తత నెట్‌వర్క్‌తో ఆమెకు ఎలాంటి సంబంధం ఉన్నట్లు నిర్ధారణ కాలేదని నాసిక్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ కర్ణిక్‌ పేర్కొన్నారు. ఈ ప్రకటన, ప్రజల్లో ప్రచారం జరిగిన కథనాన్ని సవాలూ చేస్తూ, పలు ఫిర్యాదులలో ప్రధానంగా ప్రమేయం ఉన్న వారిని వదిలేసి, పోస్‌ కమిటీ బాధ్యులను వదిలేసి, మీడియా ఆమెకే ఎందుకు ప్రాముఖ్యం ఇచ్చింది అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.

నిదాఖాన్‌ పారిపోయిందని, పోలీసులు ముంబై అంతటా వెతుకుతున్నారని, ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేయబడ్డాయని మీడియాలో వార్తలు రావడం ఉత్కంఠతను పెంచాయి. ఇలాంటి ఊహాగానాలు బహిరంగ చర్చలుగా మారుతాయి. సంచలనంగా మార్చబడిన కేసులలో సాక్ష్యాధారాలతో సంబంధం లేకుండానే మీడియా కథనాలపై ఆధారపడి ప్రజలలో అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. ఆ తర్వాత సాక్షాధారాలు బయటపడి, ఆ కేసులు నిరాధారమైని తేలినా ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాలను తొలగించే స్థాయిలో వాటికి ప్రాచుర్యం రాదు. దాంతో ప్రజల్లో కలిగిన అభిప్రాయాలు అలాగే గడ్డకట్టుకుని ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని కోరుకునేవాళ్లు కావాలని సాక్షాధారాలతో సంబంధం లేకుండా, నిరాధారమైన కథనాలని విస్తతంగా ప్రచారం చేసి, రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా మత రాజకీయాలకు సంబంధించిన కథనాలు సాక్షాధారాలతో సంబంధం లేకుండా, కేవలం భావోద్వేగాలని ఆధారం చేసుకుని చర్చోపచర్చలు చేయడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది.

కేవలం ఒక వ్యక్తిపై దష్టి పెట్టడం వల్ల ఈ కేసులోని మరింత ముఖ్యమైన కోణమైన సంస్థాగత బాధ్యతను విస్మరించే ప్రమాదం ఉంది. వేధింపులకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో పేరు పొందిన ఒక మహిళా ఆపరేషన్స్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు. ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా పోస్‌ కమిటీపై ఉన్నాయి. పని ప్రదేశంలో వేధింపులను నివారించడానికి, పరిష్కరించడానికి రూపొందించిన అంతర్గత యంత్రాంగాలు అసమర్థంగా ఉన్నాయా, లేదా పూర్తిగా విస్మరించబడ్డాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. కంపెనీ ప్రకటన అనుమానాలను పెంచేదిగా ఉంది.

తమ ూఉూన (లైంగిక వేధింపుల నివారణ కమిటీ) లేదా నైతిక విలువల కమిటీకి గతంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని టీసీఎస్‌ పేర్కొంది. అందువల్ల నిజానిజాలు స్పష్టం కావాల్సివుంది. ఆధారాలు లభించకుండానే అభిప్రాయాలను ఏర్పరచుకోవడం సరైన పద్ధతి కాదు. దర్యాప్తు ప్రక్రియ గురించి కూడా అనేక అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ఉద్యోగులు, సహాయక సిబ్బందిగా నటిస్తూ 40 రోజులు పోలీసులు రహస్యంగా ఆపరేషన్‌ నిర్వహించారన్న ప్రచారం శుద్ధ అబద్ధమని పోలీస్‌ యంత్రాంగమే స్పష్టం చేసింది. నిదాఖాన్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అని చేసిన ప్రచారం అవాస్తవం. నాసిక్‌ నుండి పారిపోయిందని చేసిన ప్రచారం అవాస్తవం. ఎందుకంటే నాసిక్‌ నుండి ముంబైకి చాలా కాలం కిందటే ట్రాన్స్ఫర్‌ అయింది. ఇవన్నీ పరిశీలించినప్పుడు ఆరోపించబడినట్లు ఈ నెట్‌వర్క్‌కు నిదాఖాన్‌ కేంద్రంగా ఉన్నట్లు ఎటువంటి ఆధారం లభించలేదు.

అందువల్ల కేసులో వెలుగులోకి వస్తున్న అంశాలు, రికార్డులు పరిశీలిస్తే నిదా ఖాన్‌ ఒక ఎఫ్‌ఐఆర్‌లో నిందితురాలు, దాన్ని కొట్టివేయలేం. అదే సమయంలో విస్తతమైన ఆరోపణలలో ఆమెను ఒక కుట్రదారుగా చిత్రీకరించడాన్ని సాక్ష్యాధారాలేవి లేదు. ఒకవైపు చట్టపరమైన చిక్కులు, మరోవైపు మీడియా ప్రచారం ద్వారా సష్టించబడిన ప్రజాభిప్రాయం మధ్య ఉన్న అంతరం చాలా విస్తతమైనది, లోతైనది. ఆమె ఆ కేసులో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కన్నా పెద్దది కాదు. కానీ చాలా పెద్దదైన ఒక కథనానికి కేంద్ర బిందువుగా మారింది. ఎవరైనా నేరానికి పాల్పడితే వారిని విచారించి శిక్షించాలి. అందులో ఎలాంటి మినహాయింపూ లేదు. కానీ ఒక మతానికి చెందిన వారు ఏదైనా నేరం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే కేసులను సంచలనంగా మార్చే నిరాధార కథనాలు వండి వార్చే పద్ధతిని సోషల్‌ మీడియా చేస్తున్నది. ఈ ధోరణి సమాజానికి ఏమాత్రం మంచిది కాదు.

నిందితుల మతం, కులం ఆధారంగా విచారణలు జరిగే పద్ధతి కూడా విచారణ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సమాధానాలు దొరుకుతాయి. వాస్తవాలు వెలుగు చూస్తాయి. కేవలం వ్యక్తిగత నేరంపైనే కాకుండా సరైన విచారణ జరిగేలా చూడాలి. వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం అనేది కార్పొరేట్‌ సంస్థల, న్యాయ సంస్థల నిష్పక్షపాత విచారణ సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. సమగ్రమైన విచారణ జరిగి నిజా నిజాలు వెలుగు చూసేవరకు ఈ ప్రశ్న అపరిష్కతంగానే మిగిలిపోతుంది. ఇది ఒక నిందితురాలిని నిశితంగా పరిశీలిస్తున్న విషయమా, లేక మత రాజకీయాల కోసం ఒక అప్రధాన వ్యక్తిని విలన్‌గా చిత్రీకరిస్తున్నారా? అనేది కాలమే నిగ్గు తేల్చాలి.

ఎం.డి అబ్బాస్‌
9030098032

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -