Thursday, September 10, 2026
E-PAPER
Homeజాతీయంసీఎంగా రేపే విజయ్ ప్రమాణ స్వీకారం

సీఎంగా రేపే విజయ్ ప్రమాణ స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్‌ పార్టీలు కూడా తమ మద్దుతును ప్రకటించాయి. దీంతో టీవీకే మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంది. ఇదే విషయాన్ని లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన టీవీకే పార్టీ చీఫ్‌ విజయ్ చర్చించారు. ఈ క్రమంలో తమకు 120 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని విజయ్ గవర్నర్‌కు లేఖలు అందజేశారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌, VCK, IUMLల మద్దతుతో 120కి పెరిగినట్టు వివరించారు. దీంతో రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇక గవర్నర్ అనుమతితో లైన్‌ క్లియర్ కావడంతో సీఎంగా శనివారం ఉదయం 11కి నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో విజయ్‌ ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -