Monday, May 11, 2026
E-PAPER
Homeజాతీయండీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్

డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పుల నేపథ్యంలో డీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. శాసనసభ్యుల ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు ఆదివారం ఈ ప్రకటన వెలువడింది. ఉపనేతగా సీనియర్ నేత కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలును నియమించారు. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ లభించలేదు. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో డీఎంకే కూటమిలోని పార్టీల మద్దతును టీవీకే కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -