Monday, May 11, 2026
E-PAPER
Homeజాతీయంఎంకే స్టాలిన్ ఇంటికి సీఎం విజ‌య్

ఎంకే స్టాలిన్ ఇంటికి సీఎం విజ‌య్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను క‌లిశారు. చెన్నైలోని ఆయ‌న నివాసానికి స్వ‌యంగా వెళ్లి మ‌ర్యాద‌పూర్వంగా మందలించారు. ఇరువురు నేత‌లు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటొల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా సీఎం విజ‌య్ షేర్ చేశారు.

కాగా, ఆదివారం టీవీకే అధినేత విజ‌య్ సీఎంగా ప్ర‌మాణస్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అంతేకాకుండా అధికార పార్టీతో పాటు ప్ర‌తిప‌క్షపార్టీల ఎమ్మెల్యేలు ప్ర‌మాణస్వీకారం చేశారు.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే 108,కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఐ(ఎం)2 డీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాలు సాధించాయి. వామ‌ప‌క్షాల‌తో పాటు కాంగ్రెస్ భాగ‌స్వామ్యంతో టీవీకే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎంకే స్టాలిన్ ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. కొత్తులూరు నుంచి పోటీ చేయ‌గా టీవీకే అభ్య‌ర్థిపై ఆయ‌న ఓట‌మి చ‌విచూశారు. డీఎంకే పార్టీ యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -