సన్‌రైజర్స్, టైటాన్స్ ఢీ నేడు
రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఐపీఎల్19 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. పాయింట్ల పట్టికలో టాప్-3లో నిలిచిన జట్లు 14 పాయింట్లతో ఉన్నాయి. టాప్-4లో చోటు కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. దీంతో లీగ్ దశ ఆఖర్లో ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. నేడు అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ లాంఛనం చేసుకోవటంతో పాటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకోనుంది. టాప్-2లో నిలిచే అవకాశాలు మెరుగుపర్చుకోనుంది. దీంతో ఇటు సన్‌రైజర్స్, అటు టైటాన్స్ నేటి మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో మొతెరాలో మోత మోగనుంది.
జోరుమీదున్న సన్‌రైజర్స్
ఈ సీజన్లో అత్యంత నిలకడగా 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల తేడాతో గెలుపొంది జోరుమీదుంది. బ్యాటింగ్ లైనప్‌లో టాప్-4 బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిశ్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లు దంచికొడుతున్నారు. పవర్‌ప్లేలో, మిడిల్ ఓవర్లలో పరుగుల వరద పారిస్తున్నారు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, యువ ఆటగాళ్లు సాలిల్ అరోరా, అనికెత్ వర్మ సైతం నిలకడగా రాణిస్తున్నారు. పవర్‌ప్లేలో టాప్ ఆర్డర్ మెరిస్తే.. సన్‌రైజర్స్ అలవోకగా భారీ స్కోర్లు సాధింగలదు. అభిషేక్, ట్రావిశ్ హెడ్‌లలో ఒకరైనా తొలి ఆరు ఓవర్లు ఆడటం సన్‌రైజర్స్‌కు కీలకం. బౌలింగ్ విభాగంలోనూ ఆరెంజ్ ఆర్మీ దూకుడుగా సాగుతోంది. పాట్ కమిన్స్, ఈషన్ మలింగ, సకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్‌లు ఎటాకింగ్ బౌలింగ్ చేస్తున్నారు. ఈషన్ మలింగ వికెట్ల వేటతో పాటు పరుగుల నియంత్రణతో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. బంతితో సన్‌రైజర్స్‌కు ఈషన్ మలింగ ప్రదర్శన కీలకం.
టైటాన్స్‌కు సొంతగడ్డ జోష్
గుజరాత్ టైటాన్స్ సీజన్ ఆరంభంలో తడబడినా.. సరైన సమయంలో ఫామ్ అందుకుంది. వరుసగా నాలుగు విజయాలతో జోష్ మీదుంది. రాజస్తాన్ రాయల్స్‌పై 77 పరుగులతో భారీ విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ మరో విజయంతో టేబుల్ టాపర్‌గా నిలిచేందుకు ఎదురుచూస్తుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లు నిలకడగా రాణిస్తున్నారు. జోశ్ బట్లర్, వాషింగ్టన్ సుందర్‌లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలుస్తున్నారు. పవర్‌ప్లేలో వికెట్లు నిలుపుకుని ఆఖర్లో ఎదురుదాడి చేయటం టైటాన్స్ శైలి. లక్ష్యాలను నిర్దేశించినా, ఛేదించినా టైటాన్స్ ఇదే ఫార్ములా అనుసరిస్తోంది. బౌలింగ్ విభాగంలో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ కట్టుకుంటున్నారు. ఇక్కడి పిచ్‌లపై రబాడ నిలకడగా వికెట్లు రాబడుతున్నాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ రషీద్ ఖాన్ మాయపై టైటాన్స్ ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ సన్‌రైజర్స్‌తో ఆరు మ్యాచ్‌ల్లో రషీద్ ఖాన్ 2 వికెట్లే పడగొట్టాడు. ఈ బలహీనత సన్‌రైజర్స్‌కు బలంగా మారుతోంది.
అగ్రస్థానంపై కన్నేసి..
- Advertisement -
- Advertisement -



