- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 889 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్‌లో 2,67,285 మంది, సెకండ్ ఇయర్‌లో 1,31,073 మంది, మొత్తం 3,98,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమైనా ప్రవేశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షలు మే 28వ తేదీ వరకు కొనసాగుతాయి.
- Advertisement -



