- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసిన అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేడేట్ ఇచ్చింది. రేపు (సోమవారం) మధ్యాహ్నం 02:30 గంటలకు టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా మార్కులను చూసుకోవచ్చు. అభ్యర్థుల సౌకర్యార్థం విద్యాశాఖ ప్రత్యేకంగా అధికారిక పోర్టలు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in లో లాగిన్ అయి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 115,028 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
- Advertisement -


