నవతెలంగాణ-జన్నారం : జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులోని సర్వే నంబర్ 45 లో పూర్వీకులు ఇచ్చిన ఇనాం భూమిని కలమడుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని కలమడుగు గ్రామానికి చెందిన బద్ది రాజవ్వ, బద్ది శ్రీనివాస్ లు ఆరోపించారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబ సభ్యులతో కలిసి వారు మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం ఇంట్లో పని చేయడంతో ఎకరంఐదు గుంటల భూమిని ఇనాం గా ఇచ్చారని, 2001 లో ఆర్వోఆర్ ద్వారా సంక్రమణ జరిగిందన్నారు. ఇప్పుడు వారి కుటుంబీకులు వచ్చి ఆ భూమిని లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వేసుకున్న గుడిసెను కూడ తొలగించారన్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి నా భూమి నాకే దక్కేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఒంటెల రామక్క, బుచ్చవ్వ, యమున, గంగరెడ్డి, రాజవ్వ, భీమవ్వ, రాయపోశం తదితరులున్నారు.
మా భూమిని మాకే ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


