Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలం

నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలం

- Advertisement -

– విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు : చింతల నాగరాజు
నవతెలంగాణ – ఉప్పునుంతల 

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో వరుసగా జరుగుతున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్నాయని మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చింతల నాగరాజు ఆరోపించారు. నీట్ పరీక్ష రద్దుతో 22 లక్షల మంది విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ)ను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ, సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు.

రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయికి మార్చి నీట్ పేరుతో అమలు చేయడం వల్ల ఇలాంటి సమస్యలు పెరిగాయని అన్నారు. ఏ రాష్ట్రంలో ప్రశ్నాపత్రం లీకైనా దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు కావడం విద్యార్థులకు తీవ్ర అన్యాయం అవుతోందని పేర్కొన్నారు. ఈసారి రాజస్థాన్ రాష్ట్రంలో 122కు పైగా ప్రశ్నలు లీకైనట్లు ఆరోపించారు. ఇకనైనా పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించి, రాష్ట్రాల వారీగా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -