- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు కింద పడి దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురి మృతదేహాలను ట్రాక్ పై చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ కు పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు, మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు వంటి పలు కోణాల్లో విచారణ జరుగుతోంది.
- Advertisement -



