నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లోని బంకిపూర్ బైపోల్ కౌంటింగ్ లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ హవా నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై పూర్తి స్థాయి ఆధిపత్యం చూపించారు. మొత్తం 31 రౌండ్ లకు గాను 22 రౌండ్స్ లో కూడా పీకే ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఆయన విజయం ఖరారు కానుంది. ఆ పార్టీ శ్రేణులు పాట్నాతో పాటు బంకిపూర్ లో సంబరాలు చేసుకుంటున్నారు. పరస్పరం రంగులు వెదజల్లుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు మధ్యప్రదేశ్‌లోని దతియాలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ 38,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉండగా, బీజేపీకి చెందిన అశుతోష్ తివారీ 6,500 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. గుజరాత్‌లోని మంజల్‌పూర్‌లో, ఓట్ల లెక్కింపు చివరి దశలో ఉండగా బీజేపీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ 29,000కు పైగా ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు.



