ఐదేళ్లుగా రూ.20 వేలు పెండింగ్ లో చలాన్లు..
నవతెలంగాణ-అచ్చంపేట
సాధారణ వ్యక్తుల వాహనాలు చలాన్లు పెండింగ్లో ఉంటే.. ట్రాఫిక్ పోలీసులు ఆర్టీవో అధికారులు పట్టుకొని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ జిల్లా అటవీ శాఖ అధికారికి చెందిన TS 05 FE 9855 నెంబర్ గల వాహనం ఆర్టిఓ, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నారు. ఓవర్ స్పీడ్, డేంజర్ స్పీడ్ , సర్వీస్ రోడ్డులో రాంగ్ పార్కింగ్ లు, ఇలా ఐదేళ్లుగా 20 చలాన్లు వాటి విలువ రూ.20,100/- పెండింగ్ లో ఉన్నాయి.
పై నెంబర్ గల వాహనంపై మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 122/177 కింద చలాన్ విధించారు. ఈ సెక్షన్ అనేది ప్రమాదకర రీతిలో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించేలా రోడ్డుపై వాహనాన్ని పార్కింగ్ చేయడం సూచిస్తుంది. ఇదే వాహనానికి మోటరు వాహనాల చట్టం సెక్షన్ 184 కింద చలాన్ విధించారు. ఈ సెక్షన్ అనేది డేంజర్ స్పీడ్ ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తున్నారని సూచిస్తుంది. మొదటి తప్పుకు రూ. 5000 జరిమానా లేదా 6. నెలల జైలు శిక్షను విధించవచ్చు. రెండోసారి ఇదే తప్పు చేస్తే రూ.10,000 జరిమానా లేదా 2 సంవత్సరాలు జైలు శిక్ష వేయవచ్చని, ఈ సెక్షన్ సూచిస్తుంది. కానీ ఈ జిల్లా అటవీశాఖ అధికారి వాహనం పైన 10కిపైగా 184 సెక్షన్ పైనే చలాన్లు విధించారు.
చాలన్ లు కట్టకుండా 3 నెలలు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయవచ్చు.
పాత పెండింగ్ చలాన్లు కట్టడం లేదని కోర్టుకు రిఫర్ చేయవచ్చు. కానీ జిల్లా అటవీ శాఖ అధికారి వాహనం ఐదు ఏళ్లుగా చాలాలు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదని సామాన్య ప్రజలు, కొందరు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు
అధిక చలాన్లు పెండింగ్ లో ఉంటే వాహనాన్ని సీజ్ చేస్తాం.. వెంకటయ్య జిల్లా ట్రాఫిక్ పోలీస్ అధికారి, నాగర్ కర్నూల్
సాధారణంగా రెండు కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ ఉంటే వెహికల్ చెకింగ్ సమయంలో దొరికినప్పుడు కచ్చితంగా వాహనాన్ని ఆపి కచ్చితంగా కట్టిస్తాము. పెండింగ్ చలాన్లు ఎక్కువ ఉంటే చెకింగ్ సమయంలో ఎదురైతే ఆ వాహనాన్ని కచ్చితంగా 100% సీజ్ చేస్తాం. జిల్లాలలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది.



