- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బంగ్లాదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 54 మంది ప్రాణాలు కోల్పోగా, ఖగ్రాచారి, రంగమతి సహా పలు జిల్లాల్లో సుమారు ఆరు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయం కాగా, కొండచరియలు విరిగిపడటంతో రవాణా, జనజీవనం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తోంది.
- Advertisement -



