నవతెలంగాణ – మిడ్జిల్
18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలని, ఓటును, నోటుకు మద్యానికి, అమ్ముకోవద్దని నిజాయితీపరులకు ఓటును వేయాలని తహసిల్దార్ స్వప్న అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు ప్రజా పతినిధులు, అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఓటు ఒక ఆయుధం అని దాని ప్రజలు దుర్వినియోగం చేయవద్దని సూచించారు. మనం వేసే ఓటు దేశ భవిష్యత్తు మారుస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, నాయకులు గౌస్, సర్పంచులు నాగరాజు గౌడు, సువర్ణ, మాధవి , మనీ శంకర్ నాయక్, మండల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఓటును నోటుకు అమ్ముకోవద్దు: తహశీల్దార్ స్వప్న
- Advertisement -
- Advertisement -



