– దంత ఆరోగ్య శిబిరం, పూర్వవిద్యార్థులు, తల్లిదండ్రుల సమీక్షా సమావేశాలు, ఉత్తమ ఫలితాల విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ: జి.జి. కళాశాలలో ప్రజాపాలన”విద్యావారోత్సవాల్లో” భాగంగా 4వ రోజు గురువారం దంత ఆరోగ్య శిబిరం, పూర్వవిద్యార్థులు, తల్లిదండ్రుల సమీక్షా సమావేశాలు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సమన్వయకర్త డా.ముత్తెన్న ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోనీ ప్రముఖ సీనియర్ దంత వైద్యులు డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ కవిత పర్యవేక్షణలో దంత వైద్య శిబిరం నిర్వహించారు.
అత్యాధునికమైన (ఏఐ) కృత్రిమ మేధ యంత్రంతో సుమారు150 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. నోటి శుభ్రత వల్ల అనేక జబ్బులు నివారించుకోవచ్చని డాక్టర్లు అవగాహన కల్పించారు. సమన్వయకర్త డాక్టర్ కే.రంజిత ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్పొరేటర్లను, పురప్రముఖులను, ఉపాధ్యాయులను, నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ మమత సమక్షంలో ఘనంగా సన్మాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సమన్వయకర్త జయప్రసాద్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులతో కళాశాల అభివృద్ధిని, విద్యార్థుల పురోగతిని సమీక్షించడం జరిగింది.
సమన్వయకర్త దండుస్వామి ఆధ్వర్యంలో కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడమైనది. జి జి కళాశాలలో చదువుకొని, ఉన్నత స్థానాల్లోకి ఎదిగినవారు. ఉద్యోగాలు పొందిన వారు, వివిధవస్థాయులలో పనిచేసినవారు దుబ్బ రాజం, ఉమాపతి, వంటి ప్రముఖులు కూడా హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రంగరత్నం, ఏ.వో. రామ్ కిషన్, వివిధ సమన్వయ కర్తలు రామస్వామి, రామకృష్ణ, రాజేష్, రమేష్ గౌడ్, పూర్ణచందర్ రావు, బాలామణి, కిరణ్ కుమార్ గౌడ్, అధ్యాపకులు, నహిదాబేగం, వేణుగోపాల్, వినయ్ కుమార్, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



