Wednesday, July 15, 2026
E-PAPER
Homeజాతీయంఅహ్మదాబాద్‌ విమాన ప్రమాదం..అక్టోబర్ నాటికి తుది నివేదిక

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం..అక్టోబర్ నాటికి తుది నివేదిక

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా సంస్థ, ఏవియేషన్ నిబంధనల ప్రకారం దర్యాప్తును ఆరు వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.ఈ దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 2026 నాటికి తుది నివేదిక ముసాయిదాను సిద్ధం చేస్తామని తెలిపింది. ప్రమాదం తీవ్రత, సాంకేతిక సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకుని ఈ దర్యాప్తును శాస్త్రీయంగా నిర్వహిస్తున్నామని  ఏఏఐబీ తెలిపింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) నిబంధనల ప్రకారం, ఈ విమాన ప్రమాద దర్యాప్తు అనేది కేవలం దేశీయ పరిధిలోనిది మాత్రమే కాదని, అంతర్జాతీయ ఒప్పందాల మేరకు నిర్వహించే ప్రక్రియ అని ‘ఏఏఐబీ’ తన అఫిడవిట్‌లో వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -