Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట పొలాల్లో ఫాం పాండ్స్ నిర్మాణానికి ముందుకు రావాలి

పంట పొలాల్లో ఫాం పాండ్స్ నిర్మాణానికి ముందుకు రావాలి

- Advertisement -

– మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రైతులు తమ పంట పొలాల్లో ఫాం పాండ్స్ నిర్మాణాలకు ముందుకు రావాలని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ బుధవారం ఒక ప్రకటనలో  కోరారు.రైతులు ఎవరైనా వారి పంట పొలాల్లో ఫాం పాండ్స్ నిర్మించుకోదల్చుకుంటే వారికి 100 శాతం సబ్సిడీ కింద ఈజీఎస్ ద్వారా ఫాం పాండ్స్ కట్టించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అవసరం ఉన్న రైతులు స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.ఫాం పాండ్స్ పంట పొలాల్లో వర్షపు నీటిని, పొలంలోకి వచ్చే అదనపు నీటిని నిల్వ చేసుకోవడానికి తవ్వే చిన్న చెరువులు.

ఫాం పాండ్ వల్ల లాభాలు..
వర్షాకాలంలో నిల్వ చేసిన నీటిని రబీలో గానీ, పొడి కాలంలో కాపులకు గానీ వాడుకోవచ్చని వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ తెలిపారు.పాండ్ చుట్టూ నీరు ఇంకి బోర్లలో నీటిమట్టం, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఎరువు, మట్టి నష్టం తగ్గుతుంది. పొలం నుండి కొట్టుకుపోయే మట్టిని, పోషకాలను పాండ్ లో ఆపుతుంది. పాండ్ లో చేపలు, బాతులు పెంచొచ్చు. గట్టుపై కూరగాయలు, అరటి, నిమ్మ మొక్కలు పెంచి అదనపు ఆదాయం పొందవచ్చు.

ఎక్కడ, ఎలా తవ్వాలి.
పొలంలో అత్యల్ప ప్రాంతంలో, నీరు సహజంగా నిలిచే చోట తవ్వితే బాగుంటుంది.సాధారణంగా 30x30x3 మీటర్లు లేదా 20x20x2.5 మీటర్లు తీసుకుంటారు. 1 ఎకరా పొలానికి 10 శాతం విస్తీర్ణం సరిపోతుంది. వర్షపు నీరు లోపలికి వచ్చే దారి, నిండిన తర్వాత అదనపు నీరు బయటికి పోయే దారి తప్పనిసరి. నీరు ఇంకకుండా ఉండాలంటే HDPE ప్లాస్టిక్ షీట్ లేదా సిల్ట్ వేయడం మంచిది. మొక్కజొన్న, సోయా వేసే రైతులు ఈ పాండ్ నీటిని క్రిటికల్ స్టేజ్ లో లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కి బాగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది.తెలంగాణ ప్రభుత్వం రైతు ఫాం పాండ్ పథకం కింద రైతులకు 100 శాతం  సబ్సిడీ ఇస్తుందని వ్యవసాయ అధికారిని వివరించారు. అవసరం ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -