నవతెలంగాణ-హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష(NEET UG 2026) తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. జూన్ 21వ తేదీ, ఆదివారం రోజున పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. మే 3వ తేదీన జరిగిన నీట్ యూపీ పరీక్ష పేపర్ లీకైన విషయం తెలిసిందే. దీంతో ఆ ఎగ్జామ్‌ను ఎన్టీఏ రద్దు చేసింది. అయితే విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రీ ఎగ్జామినేషన్ తేదీని ప్రకటించింది. ఎన్టీఏకు చెందిన అధికార సమాచార ఛానల్స్‌ను మాత్రమే నీట్ అభ్యర్థులు, విద్యార్థుల పేరెంట్స్ ఫాలోకావాలని ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతితోనే జూన్ 21వ తేదీన నీట్ యూజీ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది.
జూన్ 21న నీట్-యూజీ పరీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



