- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓ యువతిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది తేజ మృతి చెందాడు. జడ్చర్లలోని ఎర్రకుంట కాలనీకి చెందిన వైష్ణవి(22)ని హైదరాబాద్కు చెందిన తేజ(28) కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమవడంతో కక్ష పెంచుకున్న తేజ.. శనివారం ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. స్థానికులు ఆగ్రహంతో తేజను పట్టుకుని చితకబాదారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తేజ చనిపోయాడు.
- Advertisement -



