- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్ ఆడనుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఆడతారా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. చెన్నై హోమ్ గ్రౌండ్లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో ధోనీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో తన చివరి టీ20 మ్యాచ్ చెన్నైలో ఆడాలని ధోనీ చెప్పిన వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడితే గుజరాత్ టైటాన్స్, SRH ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
- Advertisement -



