Sunday, August 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలోయలో పడిన మినీ బస్సు.. 14 మంది మృతి

లోయలో పడిన మినీ బస్సు.. 14 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణ అమెరికా దేశం పెరూలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాజమార్కా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి సుమారు 650 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. లోయ లోతుగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు తాళ్ల సాయంతో లోయలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -