Saturday, August 8, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే

ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులే

- Advertisement -

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 
నవతెలంగాణ-మర్రిగూడ 
ప్రజా సమస్యలే ముఖ్య ఎజెండాగా నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసేది కమ్యూనిస్టులేనని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం మండలంలోని శివన్నగూడ గ్రామంలో జీపు జాత బైక్ ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బడుగు బలహీన, నిరుపేద వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. రైతు సమస్యలను పట్టించుకోవటం లేదని, కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిందని, ఉద్యోగాలను భర్తీ చేయకుండా పేపర్ లీకేజీల పేరుతో యువత జీవితాలను నాశనం చేస్తుందని ఆరోపించారు.

బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు శ్రేణులు కూడా అమరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధం కావాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని, ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు గడిచిందని, ఇక మిగిలిన సమయంలోనైనా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని గుర్తు చేశారు. మండలంలో ఉన్న శివన్నగూడ రిజర్వాయర్ ను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు త్రాగు, సాగునీరు అందించాలని, రిజర్వాయర్ భూ నిర్వాసితలకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈదుల బిక్షం రెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు జగన్, కార్యదర్శి చెల్లం పాండురంగారావు, మండల కార్యవర్గ సభ్యులు ఆకుల రఘుమయ్య, ఎరుకల నిరంజన్ గౌడ్, జక్కల అంజయ్య యాదవ్, కొట్టాల సర్పంచ్ కామ్రేడ్ కల్లెట్ల లింగయ్య, సత్యం, వెంకటయ్య, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -