Saturday, August 8, 2026
E-PAPER
Homeఖమ్మం​మాచినేని కృష్ణయ్యను పరామర్శించిన మంత్రి తుమ్మల

​మాచినేని కృష్ణయ్యను పరామర్శించిన మంత్రి తుమ్మల

- Advertisement -

నవతెలంగాణ – సత్తుపల్లి
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెనుబల్లి మండలం, లంకపల్లి గ్రామానికి చెందిన మాచినేని కృష్ణయ్యను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పరామర్శించారు. మంత్రి తుమ్మలకు అత్యంత ఆప్తుడైన కృష్ణయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నేరుగా ఆసుపత్రికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి వైద్యులతో మాట్లాడి, కృష్ణయ్యకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -