శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని ఈ నెల 14న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో హీరో శ్రవణ్ రెడ్డి శనివారం మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ‘’డర్టీ హరి’కి పూర్తి భిన్నంగా ‘అగధ’లో నా పాత్ర ఉంటుంది. చాలా పార్శ్వాలు ఉండేలా కారెక్టర్‌ను డిజైన్ చేశారు. చాలా షేడ్స్ ఉన్న ఈ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. ఎంఎస్ రాజు వంటి విజన్ ఉన్న ఫిల్మ్ మేకర్ మళ్లీ నాకు అవకాశం ఇవ్వడం చాలా లక్కీ అనిపిస్తుంది. ‘అగధ’ నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా, డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా ‘అగధ’ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో హారర్, థ్రిల్ మూమెంట్స్ చాలా ఉంటాయి.
ఏదైనా సరే కొత్తగా ఓ హుక్ పాయింట్ ఉండాలని ఎంఎస్ రాజు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందులో నెగెటివ్ పాత్ర అనేది ఉండదు. పరిస్థితుల వల్లే పాత్రలు అలా ప్రవర్తిస్తుంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్, గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టుగా సాగుతుంది. ఈ చిత్రాన్ని దాదాపు నేచురల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశారు. కొన్ని మాత్రం సెట్స్ వేశారు. ఈ మిస్టిక్, హారర్ ఫీల్‌ను ఇవ్వడానికి సెట్స్ వేయాల్సి వచ్చింది. మా సినిమాలోని వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా నీట్‌గా, ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే టీంలో పని చేసిన చంద్ర దర్శకత్వంలో ఓ మూవీని చేస్తున్నాను. ఆల్రెడీ కాశ్మీర్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాం. కొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల్లో ఉన్నాయి’ అన్ని చెప్పారు.
‘అగధ’ అద్భుతంగా ఉంటుంది
- Advertisement -
- Advertisement -



