నవతెలంగాణ-హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగాయి. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్జ్ ఎండీ సోనీబాలా దేవి తదితరులు కార్యక్రమానికి హాజరై ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన తెలంగాణ హాకీ లీగ్ ఫైనల్స్‌ను తిలకించారు. ‘ధ్యాన్‌చంద్ క్రీడాస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప క్రీడాకారుడు. అద్భుతమైన ఆటతీరు క్రమశిక్షణ, ఏకాగ్రతతో భారత హాకీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. యువత రీల్స్‌పై కాకుండా, భవిష్యత్ కోసం క్రీడలపై దృష్టి సారించాలని’ సూచించారు.
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



