- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా కొట్టుకుపోయిన ఏడు మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషినగర్ జిల్లాల నదీ తీరాల్లో తేలుతూ లభ్యమయ్యాయి. నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవహించే గండకీ నదీ మార్గం ద్వారా ఈ మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. లభ్యమైన మృతదేహాలను గుర్తించేందుకు భారత అధికారులు నేపాల్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తును వేగవంతం చేశారు.
- Advertisement -



