- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం, రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. చియాపాస్ తీరానికి సమీపంలోని అఖిలెస్ సెర్డాన్‌కు నైరుతి దిశగా 48 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రధాన భూకంపానికి ముందు సముద్ర గర్భంలో స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
- Advertisement -



