- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని న్యూ మెక్సికోలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాపట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవుల పూర్ణగోపి (35) మృతి చెందారు. కుటుంబంతో కలిసి కారులో వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పూర్ణగోపి తండ్రికి తీవ్ర గాయాలవగా, తల్లి, తమ్ముడికి కూడా గాయాలయ్యాయి. పూర్ణగోపి తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ఇటీవల పూర్ణగోపి తన చిన్న కుమారుడు, భార్యతో కలిసి అమెరికా వెళ్లారు.
- Advertisement -


