Tuesday, July 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసిప్ అబకస్ ప్రొడిజి పోటీలలో ప్రతిభ చాటిన హబ్సిగూడ విద్యార్థులు..

సిప్ అబకస్ ప్రొడిజి పోటీలలో ప్రతిభ చాటిన హబ్సిగూడ విద్యార్థులు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ క్లాసిక్ కాన్వీన్ష త్రిలో ఆదివారం నిర్వహించిన 22వ సిప్ అబకస్ తెలంగాణ రీజినల్ ప్రోడిజీ 2026 పోటీలలో రాష్ట్రం నలుమూలల 80 కి పైగా ఉన్న సెంటర్ ల నుంచి 3200 పైగా పిల్లలు వివిధ లెవెల్స్ పాల్గొన్నారు. అందులో హబ్సిగూడ సెంటర్ నుండి 150కి పైగా పాల్గొని తమ ప్రతిభని చాటారని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు గంప కవిత తెలియజేశారు, అందులో వివిధ విభాగాల లో ఇద్దరు ఛాంపియన్స్,50 కి పైగా రన్నెరప్ మరియు 60 కి పైగా పెరఫార్మెన్స్ అవార్డ్స్ గెలుచు కొని సత్తా చాటడం జరిగింది. సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ నేటి విధార్థులు మార్కులు ఒక్కటే లక్ష్యం కాకుండా బుద్ది వికాషత్, ఏకగ్రత, పరిస్థితుల కు అనుగుణంగా సమస్యలను తక్షణమే పరిష్కరించే సమర్థత నేటి తరం పిల్లలలో ఎంతో అవసరం. అలాంటివారే రాబోయే రోజులలో ప్రత్యేకమైన గుర్తింపు కలిగి సమాజానికి ఆదర్శనంగా నిలుస్తారని తేలిపారు,అంతరిక్షానికి అనుసంధానం అవుతున్న ఈ ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మీ పిల్లల బంగారు భవిష్యత్తు అబకస్ శిక్షణ ఒక గీటురాయి లాంటిది అని తెలియచేయడం జరిగింది. బ్రాంచి నిర్వాహకులు తమ బోధన సిబ్బంది మరియు తల్లి దండ్రులకోసం తమ కృతజ్ఞతలు తెలీజేస్తూ తమ సంస్థ పదో సంవత్సరం జరుపుకోవడం చాలా సంతోషం గా ఉన్నది అని తెలియజేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -