Tuesday, July 21, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లి బీసీ బాలుర హాస్టల్‌ను పరిశీలించిన డాక్టర్ మట్టా దయానంద్

సత్తుపల్లి బీసీ బాలుర హాస్టల్‌ను పరిశీలించిన డాక్టర్ మట్టా దయానంద్

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి : ​సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్ రింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న అయ్యగారిపేట ప్రధాన రహదారిలోని (శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం రోడ్డు) బీసీ బాలుర హాస్టల్‌ను కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మంగళవారం  సందర్శించారు.

​ఈ సందర్భంగా హాస్టల్‌లోని భోజన గది, విద్యార్థుల గదులు, బాత్రూంలు, క్రీడా ప్రాంగణాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించారు. ​హాస్టల్ భవన పరిస్థితులను, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ​విద్యార్థులకు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం అందించాలని ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారిని కోరారు. హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్‌ పర్సన్ బొంతు సుమలత పాల్గొన్నారు. కౌన్సిలర్లు గ్రాండ్ మౌలాలి, విరివాడ అపర్ణ, శరత్ చంద్ర, ​పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు, మొహమ్మద్ కమల్ పాషా పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -