అక్టోబర్ 4న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి
అయ్యాల సంతోష్ పిలుపు
నవతెలంగాణ-మద్నూర్
మాలల రోస్టర్ పాయింట్ల సాధనకై అక్టోబర్ 4న చలో హైదరాబాద్ నిజాం కాలేజ్ ఠాగూర్ ఆడిటోరియం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల సంఘం వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 4న మాలల రోస్టర్ పాయింట్ల సాధనపై బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 16 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా, 12 నోటిఫికేషన్లలో మాలలకు ఒక్క పోస్టు కూడా కేటాయించలేదన్నారు. రోస్టర్ పాయింట్లలో 12 లోపు మాలలకు కేటాయింపు ఉండేలా మార్పులు తేవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, మాల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు జన సమీకరణతో సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల అధ్యక్షుడు ఆకాష్, నాయకులు జైపాల్, శ్రావణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రోస్టర్ లో మాలలకు న్యాయం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



