Tuesday, September 22, 2026
E-PAPER
Homeఖమ్మంఅంబేద్కర్ అభయ హస్తం అమలు చేయాలి

అంబేద్కర్ అభయ హస్తం అమలు చేయాలి

- Advertisement -

– వ్యకాస సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి   జాజిరి శ్రీనివాస్ డిమాండ్
నవతెలంగాణ-సత్తుపల్లి 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన అంబేద్కర్ అభయ హస్తం హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గంగారంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో భాగంగా ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ. 12 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ పథకం కోసం ప్రతి ఏటా బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తామని తెలిపినప్పటికీ, ఇప్పటివరకు అమలుపై స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. నేటికీ అనేక ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు భూమి, ఇల్లు, ఉపాధి, విద్య కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా, ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని కోరారు.

​సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించేందుకు ఈ పథకాన్ని విధానపరంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆ సంఘ మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, కావూరి వెంకటేశ్వరరావు, మోదుగు వెంకటేశ్వరరావు, పులిజాల సురేందర్, రాంబాబు, శ్రీకాంత్, రాము పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -