– చెరువు భూమిని కాపాడి మూడు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలి
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం పాకలగూడెం పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామ సమీపంలో ఉన్న సుమారు 30 ఎకరాల ‘వెనుకకుంట’ చెరువు భూమి ఆక్రమణలకు గురైంది. ఈ చెరువు కొన్ని దశాబ్దాలుగా పాకలగూడెం, కోనాయిగూడెం, సత్యనారాయణపురం గ్రామాల ప్రజలకు తాగునీరు, సాగునీటికి ప్రధాన ఆధారం. పాత రికార్డులు, దానపత్రాల ప్రకారం 1955లో గుమ్మల్ల అప్పయ్య అనే వ్యక్తి నిజాం నవాబు నుంచి 150 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులోని 30 ఎకరాల చెరువును 1960లో ప్రజల నీటి అవసరాల నిమిత్తం దానం చేశారు. ఈ భూదానానికి సంబంధించి అప్పయ్య కుటుంబం దగ్గర ఉన్న పత్రాలను స్పష్టం చేస్తున్నాయి. గతంలో ప్రభుత్వం కూడా ఈ చెరువు అభివృద్ధికి సుమారు రూ.50 లక్షల నిధులు మంజూరు చేసి వివిధ పనులు చేపట్టడం కూడా జరిగింది.
అయితే ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ రెవెన్యూ రికార్డులను సృష్టించి సుమారు 20 ఎకరాల మేర చెరువు భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నారని గ్రామస్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. భౌతికంగా 30 ఎకరాల విస్తీర్ణం కనిపిస్తున్నప్పటికీ, రెవెన్యూ రికార్డులలో కేవలం 9 ఎకరాలు మాత్రమే చెరువుగా చూపుతుండటం వెనుక తీవ్రమైన గోల్‌మాల్ జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ సమస్యపై రెవెన్యూ మంత్రి, కలెక్టర్, సబ్ కలెక్టర్, సత్తుపల్లి తహసీల్దార్‌కు పాత లింక్ డాక్యుమెంట్లు, ఆధారాలతో సహా పలుమార్లు గ్రామస్తులు ఫిర్యాదులు చేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా కాలయాపన చేయడం వల్ల సుమారు 20 మందికి పైగా ఆక్రమణదారులు చెరువు భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. వెనుక కుంట చెరువు ఆక్రమణ విషయమై జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కలుగ చేసుకోవాలని వేసుకోవాలని కోరుతున్నారు.
పాత రికార్డులు, లింకు డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరగాలి. పాత రికార్డులు, లింక్ డాక్యుమెంట్ల ఆధారంగా సమగ్ర విచారణ జరగాలి. అంతేకాకుండా స్వతంత్ర భూ సర్వే నిర్వహించి చెరువు అసలు విస్తీర్ణాన్ని అధికారికంగా నిర్ధారించాలి. రికార్డుల్లో జరిగిన మార్పులు, ఎవరి పేర్లపై పట్టాలు ఇచ్చారో ప్రజల సమక్షంలో పారదర్శకంగా వెల్లడించాలి. ఆక్రమణలను చట్టప్రకారం తొలగించి, చెరువు భూమిని కాపాడి మూడు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలి. దీనిపై అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
సమగ్ర విచారణ జరగాలి… గుమ్మల్ల అప్పారావు, సత్యనారాయణపురం, సత్తుపల్లి మండలం
పాత రికార్డులు, లింక్ డాక్యుమెంట్ల ఆధారంగా సమగ్ర విచారణ జరగాలి. అంతేకాకుండా స్వతంత్ర భూ సర్వే నిర్వహించి చెరువు అసలు విస్తీర్ణాన్ని అధికారికంగా నిర్ధారించాలి. రికార్డుల్లో జరిగిన మార్పులు, ఎవరి పేర్లపై పట్టాలు ఇచ్చారో ప్రజల సమక్షంలో పారదర్శకంగా వెల్లడించాలి.
తిరుమలశెట్టి సాయిబాబు… పాకలగూడెం, సత్తుపల్లి మండలం
ఆక్రమణలను చట్టప్రకారం తొలగించి, చెరువు భూమిని కాపాడి మూడు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలి. దీనిపై అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలి.



