– నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
– సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్
నవతెలంగాణ-సత్తుపల్లి : బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ), సింగరేణి యాజమాన్య సూచనల మేరకు మంగళవారం సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ పార్కింగ్ యార్డ్‌లో వృక్షారోపణ (మొక్కలు నాటే) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
10వేల మొక్కల లక్ష్యం పూర్తి
సింగరేణి సత్తుపల్లి ఏరియా వ్యాప్తంగా ఒకే రోజు 10 వేలు మొక్కలను నాటి పర్యావరణ స్పృహను చాటారు. గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రాథమిక బాధ్యత అని జీఎం చింతల శ్రీనివాస్ ఈ కార్యక్రమం సందర్భంగా తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి సత్తుపల్లి ఏరియాను హరితమయంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జీఎం స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు భాగస్వాములు కావాలని జీఎం శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పరిధిలోని అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు, ఫారెస్ట్రీ, పర్యావరణ విభాగం ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సింగరేణి సత్తుపల్లి ఏరియాలో ఘనంగా ‘మాస్ ప్లాంటేషన్ డ్రైవ్’
- Advertisement -
- Advertisement -



