- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామన్నారు. ‘‘ కేంద్ర పర్యావరణశాఖ ఫార్మాసిటీకే అనుమతిచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉంది. ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ సర్కార్ కోర్టుకు చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోంది. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని రీస్టోర్ చేస్తాం’’ అని హరీశ్ అన్నారు.
- Advertisement -



