నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వివిధ మండలాలకు సంబంధించిన గ్రామాల ఉపసర్పంచుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులుగా గంభీరావుపేట ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తంగళ్ళపల్లి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు ఆసాని శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు మందాటి రాము యాదవ్, వీర్నపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అజ్మీరా రామ్ రెడ్డి నాయక్, ముస్తాబాద్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు విజయ రెడ్డి, కోనరావుపేట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు. లంబ రాజు యాదవ్, బోయన్ పెళ్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి, చందుర్తి మండల ఉపసర్పంచల పోరం అధ్యక్షులు గంట మల్లేష్, వేములవాడ రూరల్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం
- Advertisement -
- Advertisement -



