Sunday, May 24, 2026
E-PAPER
Homeఖమ్మంఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-అశ్వారావుపేట:
ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మీడియా కో-ఆర్డినేటర్ మడిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కాసానీ పద్మశేఖర్ గార్డెన్‌లో ఆదివారం మండల అధ్యక్షులు ఉస్మాన్ బాబా, కార్యదర్శి ఫంబి ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బండి కొమరయ్య హాజరై గ్రామీణ వైద్య మిత్రులు ప్రాథమిక వైద్య సేవలకు మాత్రమే పరిమితం కావాలని సూచించారు.అధికంగా యాంటీబయాటిక్స్ వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

మండల అధ్యక్షులు మాట్లాడుతూ… పరిమిత స్థాయిలోనే వైద్యం అందించాలని, పరిస్థితి అదుపులో లేకపోతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులను తరలించాలని సూచించారు. అనంతరం సభ్యులకు ఐడీ కార్డులను జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులతో పాటు దమ్మపేట, ములకలపల్లి మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. అశ్వారావుపేట మండల కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ తాతారావు, మీడియా కోఆర్డినేటర్ మడిపల్లి వెంకటేశ్వరావు, ఫజిల్ బక్షా, ట్రెజరర్ వేల్పుల సత్యనారాయణ, ఆర్గనైజేషన్ సెక్రటరీ సాంబారు రమేష్, మౌలానా, నకనకరావు, జె. బాబురావు, రీనా సర్కార్, వెంకటనరసమ్మ, దయసాగర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -