Wednesday, September 9, 2026
E-PAPER
Homeఖమ్మంఅంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

– అరెస్టులను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ – అశ్వారావుపేట

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం హైదరాబాద్‌ లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీ ఉద్యోగులను, ధర్నా నిర్వహిస్తున్న రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.  అనంతరం ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ సయ్యద్ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్‌ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయిందన్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నప్పటికీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచలేదని విమర్శించారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పీఎంసీ ప్రీ-ప్రైమరీ విద్యను రద్దు చేయాలని, పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కృష్ణవేణి, ప్రవీణ, వెంకటరమణ, వరలక్ష్మి, సావిత్రి, వరాలు తదితరులు పాల్గొన్నారు.

దమ్మపేటలో.. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌ లో బుధవారం నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఉద్యోగులను, అక్కడ ధర్నా నిర్వహిస్తున్న రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్‌ మద్దినేని మురళి కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్‌ మురారి రఘు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులపై ప్రభుత్వం పనిభారం పెంచుతూ వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని కోరారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పీఎంసీ ప్రీ-ప్రైమరీ విద్యను రద్దు చేయాలని, పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సూరమ్మ, జయ, వెంకటలక్ష్మి, సీతారామమ్మ, వజ్రమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -