Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -
  • కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్
  • నవతెలంగాణ – కామారెడ్డి
  • జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రైస్ మిల్లులపై విధిస్తున్న 15 నుంచి 20 శాతం షార్ట్‌ఫాల్‌పై ఉపశమనం కల్పించాలని, 2025–26 ఖరీఫ్ ధాన్యం సీఎంఆర్‌ (CMR) బియ్యం విషయంలో మిల్లర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని నిర్దేశిత సమయంలో సీఎంఆర్‌గా మార్చేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నాన్‌ – ఎఫ్‌ఏక్యూ ధాన్యాన్ని మిల్లులకు కేటాయించకుండా, రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
  • అలాగే ధాన్యంలో తేమ, డ్రైయింగ్‌ లాస్‌ తదితర అంశాలపై మిల్లర్లకు ఇబ్బందులు కలగకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. 2025 – 26 ఖరీఫ్ ధాన్యానికి సంబంధించి బియ్యం మిల్లుల్లో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ బియ్యం విషయంలో తగిన గడువు ఇవ్వాలని, మిల్లులపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓపెన్‌ స్టాక్‌, గోదాముల విషయంలోనూ తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీ. రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె. సంతోష్ కుమార్, కోశాధికారి ఎం. సుధర్శన్, వర్కింగ్‌ ప్రెసిడెంట్ వి. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -