- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన గుర్రం సమ్మక్క అనారోగ్యంతో బాధపడుతుంది.ఐటిపాముల సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పంచిక ఆకర్ష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు,కొయ్యుర్ గ్రామానికి చెందిన పబ్బతి విమలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.బాధిత కుటుంబాలను బుధవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ పరమార్షించి,ఓదార్చారు.అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డితోపాటు బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



