- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ క్రాoతికుమార్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ భాష,యాస కోసం తెలంగాణ మాండలింగం కోసం, చేసిన కృషిని,రచనలు,తెలంగాణ భాష కోసం తాను చేసిన పోరాటం గొప్పదన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



