– బాధితుడికి అప్పగించిన పోలీసులు
– సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తింపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను అశ్వారావుపేట పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. అనంతారం గ్రామానికి చెందిన మద్దిపాటి చిట్టిబాబు గత నెల 1న తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఈ విషయమై అశ్వారావుపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో మొబైల్ వివరాలను నమోదు చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్‌ను గుర్తించారు. అనంతరం ఫోన్‌ను రికవరీ చేసి బుధవారం బాధితుడు మద్దిపాటి చిట్టిబాబుకు అప్పగించారు. పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి అందజేసిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు ఆలస్యం చేయకుండా పోలీసులను సంప్రదించి సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అశ్వారావుపేట ఎస్‌ఐ యాయాతి రాజు సూచించారు.
సీఈఐఆర్‌తో పోగొట్టుకున్న ఫోన్ రికవరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



