”పెద్దిలో గౌర్నాయుడిగా నటించా. నా పాత్రకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటుంది. నా పాత్రను దర్శకుడు బుచ్చిబాబు చాలా అద్భుతంగా ఆవిష్కరించారు అని శివ రాజ్ కుమార్ అన్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో రాబోతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మీడియాతో ముచ్చటించారు.
పెద్ది అద్భుతమైన కథ. ఇలాంటి మంచి సినిమాలో తప్పకుండా భాగం కావాలనిపించింది. ఒక మంచి పాత్ర చేశాననే సంతృప్తి ఉంది.
ఇందులో నాది ‘పెద్ది`కి కోచ్ పాత్రలానే ఉంటుంది. మా మధ్య ఉండే అనుబంధం చాలా ఆసక్తికరం. మా ఇద్దరి ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమాతో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని నేను భావిస్తున్నాను. చాలా కష్టపడి, ఈ పాత్ర చేశారు. దాదాపు రెండేళ్ల పాటు ఈ పాత్ర కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. పూర్తిగా ఆ పాత్రలో ఒదిగిపోయి, ఎంతో నిజాయితీగా చేశారు.
నా పాత్రతో పాటు జగపతిబాబు పాత్ర, అలాగే మిగతా అన్ని పాత్రలను కూడా బుచ్చిబాబు ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. డీవోపీ రత్నవేలు ఇచ్చిన విజువల్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి.
సినిమాలో మల్టిపుల్ స్పోర్ట్స్ ఉన్నాయి. అయితే ప్రతి క్రీడ కథతో చాలా బలంగా అనుసంధానమై ఉంటుంది. ఆ అంశాన్ని ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై ఎంతో ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ చాలా సర్‌ప్రైజింగ్ ఉంటుంది. దాన్ని మీరు థియేటర్‌లో చూసి ఆస్వాదించాలి.
నిర్మాత సతీష్ సినిమాపై చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ప్రస్తుతం ‘గుమ్మడి నరసయ్య’, ‘జైలర్ 2’ చిత్రాలు చేస్తున్నాను. మంచి కథలు వస్తే తెలుగులోనూ చేస్తాను.
‘పెద్ది` క్లైమాక్స్ చూసి ఆశ్చర్యపోతారు
- Advertisement -
- Advertisement -



