Monday, May 25, 2026
E-PAPER
Homeసినిమాఅందమైన గ్రామీణ నేపథ్య ప్రేమకథ

అందమైన గ్రామీణ నేపథ్య ప్రేమకథ

- Advertisement -


విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. వర్మ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘సింగిల్ రాజు’. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం ‘మా ఈవెంట్స్’ స‌హ‌కారంతో ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ ఎస్.ఎస్. వర్మ, విశ్వస్ ఇద్దరూ నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. ఎంతో ధృడ సంకల్పంతో ఈ సినిమాను ప్రారం భించారు. చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలిఅని తెలిపారు. 'వేణు ఉడుగుల సపోర్ట్ లేకపోతే ఈ సినిమా సాధ్య మయ్యేది కాదు. ఈ సినిమా కోసం నాకంటే ఎక్కువగా మా అమ్మానాన్న కష్టపడ్డారు. ప్రేక్షకులను తప్పకుండా అలరించే మంచి ఎంటర్‌టైనర్‌గా మా సినిమా నిలుస్తుందనే నమ్మకం ఉంది అని దర్శకుడు ఎస్.ఎస్.వర్మ అన్నారు.
హీరో విశ్వస్ మాట్లాడుతూ,’దర్శకుడు ఎస్.ఎస్. వర్మ మేము ఎంతో ప్యాషన్ తో చేస్తున్న సినిమా. ఇదొక అందమైన గ్రామీణ నేపథ్య ప్రేమకథఅని అన్నారు. 'విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని హీరోయిన్లు మౌనిక, దివ్య చెప్పారు.
ఈ చిత్రానికి పాటలు: గోరటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, ఛాయాగ్రహణం: సాయితేజ కుందారపు, నితీష్, ఎడిటింగ్: యునిక్ బొజ్జపల్లి, ప్రొడక్షన్ డిజైనర్: రాజ్ మామిడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేందర్ వర్మ, సీఈఓ: శివ వర్మ సుంకరి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -