నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకం చెక్కుల పంపిణీ కన్నుల పండుగగా కొనసాగాయి. ఈ సందర్భంగా మద్నూర్ మండల కేంద్ర గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి మాట్లాడుతూ.. ఈ పథకాలు నిరుపేద కుటుంబాలకు ఒక వరం లాంటివని తెలిపారు. ఈ పథకాల ద్వారా నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెక్కులు మంజూరైన లబ్ధిదారులు ఆనందం వ్యక్తపరుస్తున్నారని అన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, ఆర్ఐ శంకర్, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు, మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, కుటుంబ సభ్యులు రమేష్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


