Monday, February 2, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

బోయి భీమన్న సాహిత్యంపై అంతర్జాతీయ సదస్సు
‘పద్మభూషణ్‌ డా|| బోయి. భీమన్న సాహిత్యంలో విభిన్న కోణాలు’ అనే అంశంపై యం.వి.యస్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ & సైన్స్‌ కళాశాల, మహబూబ్‌నగర్‌లో ఫిబ్రవరి 3,4 తేదీలలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు ఆచార్య కె పద్మావతి, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఆచార్య ఇ.పురుషోత్తం, శ్రీమతి హైమవతీ భీమన్న, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా|| కోయి కోటేశ్వరరావు పాల్గొంటారు. వివిధ విశ్వవిద్యాలయాల, కళాశాలల ఆచార్యులు, అధ్యాపకులు పరిశోధక విద్యార్థులు పత్ర సమర్పణ చేస్తారు.
డా|| కె. కృష్ణ మూర్తి, సదస్సు కన్వీనర్‌

‘కృష్ణాతీరం-కవితాహారం’ కవి సమ్మేళనం
తెలుగు సాహిత్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు, నేటితరం సాహిత్యాన్ని రికార్డు చేసి ముందుతరాలకు దాచి వుంచేందుకు మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ-ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం సహకారంతో ఫిబ్రవరి 8న ఆదివారం కృష్ణానదిలో బోధిసిరి పడవపై వినూత్నంగా ‘కృష్ణాతీరం- కవితాహారం’ కవి సమ్మేళనం నిర్వహిస్తోంది. ప్రవహించే కృష్ణానదీ తరంగాలపై ఉరకలెత్తే కవితా ప్రవాహంగా, అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈతరం కవులు సమర్పించే కవితాహారతి ఈ కవి సమ్మేళనం.

కవిత్వాన్ని శ్వాసగా పీలుస్తూ, సమాజం కోసం కవిత్వమై జీవిస్తున్న లబ్ద ప్రతిష్టులైన నాటితరం కవులతోపాటు నేటితరం కవుల నుండి ఎంపిక చేసుకున్న 50 మంది కవులు ఈ కవి సమ్మేళనంలో కవితల్ని వినిపిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి డా. జి.లక్ష్మీశ, రేగుళ్ళ మల్లికార్జునరావు, పర్యాటక శాఖ అధికారులు హాజరవుతారు.
కలిమిశ్రీ మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ అధ్యక్షులు, 92464 15150

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -