అనుమతిచ్చిన కోర్టు
నేడు చర్లపల్లి జైలునుంచి సిట్ కార్యాలయానికి తరలింపు విచారించనున్న బృందం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి/మేడ్చల్
మైనర్ బాలికపై లైంగికదాడికి సంబంధించి పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సజంయ్ కుమారుడు బండి భగీరథ్‌ను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది. భగీరథ్‌ను తదుపరి విచారణ నిమిత్తం ఆరురోజులపాటు తమకు అప్పగించాలంటూ నాలుగు రోజుల క్రితం సిట్ అధికారులు కోర్టులో ఫిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సిట్ పిటిషన్‌పై విచారించిన కోర్టు బుధవారం నుంచి పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఉదయం ఆయన్ను చర్లపల్లి జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. కూకట్‌పల్లిలోని సిట్ కార్యాలయంలో రీతూరాజ్ నేతృత్వంలో దర్యాప్తు బృందం విచారించనుంది. ఇప్పటికే అసవరమైన ప్రశ్నావళిని సిట్ బృందం రూపొందించింది. మైనర్ బాలికపై లైంగికదాడితోపాటు వారి మధ్య జరిగిన ఫోన్ చాటింగులను భగీరథ్ డిలీట్ చేయడం, బాలికకు రూ. 50వేలు ఇచ్చాను అని ఆయన చేసిన ప్రకటనపై సిట్ మరింత లోతుగా విచారించనున్నట్టు తెలిసింది. లైంగికదాడి ఆరునెలల క్రితం జరిగినట్టు భగీరథ్ పేర్కొంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆధారాలను సేకరించనుంది. మైనర్ బాలిక తల్లి వాగ్మూలాన్ని పూర్తిగా క్రోడికరించి, భగరీథ్ నుంచి అదనపు సమాచారాన్ని , నిజాలను వెలికి తీసేందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసింది. మొత్తం మీద సిట్ అధికారుల విచారణలో నిందితుడు ఏమేరకు అంగీకరిస్తారనే కోణంలో ఇటు రాజకీయ వర్గాలు, అటు పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాల్సిందే.
పోలీస్ కస్టడీకి బండి భగీరథ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



