రూ.6,500 జరిమానా
మహబూబాబాద్ జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పు
నవతెలంగాణ-తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన ఒక ఓ బాలికపై లైంగికదాడి కేసులో నిందితునికి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.6500 జరిమానా విధించింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా న్యాయమూర్తి అబ్దుల్ రఫీ మంగళవారం తీర్పు ఇచ్చారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. తొర్రూరు పట్టణానికి చెందిన ఓ బాలికపై జూన్ 29, 2024న ఇనుగుర్తి గ్రామానికి చెందిన యువకుడు పసునూరి రాము లైంగికదాడి చేసినట్టు బాధితురాలి బాబాయి తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ రాంజీ నాయక్ పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, టి.సంజీవ చార్జిషీట్ దాఖలు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి 14 మందిని కోర్టులో హాజరుపరచగా ప్రాసిక్యూషన్ పక్షాన పిపి కొంపెల్లి వెంకటయ్య వాదించారు. పూర్తి విచారణ అనంతరం నిందితునికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.6,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి తెలంగాణ బాధితుల నష్టపరిహారం పథకం కింద ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ గణేష్, ఎస్‌ఐ ఆధ్వర్యంలో సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచిన కోర్టు కానిస్టేబుల్ శ్రీశైలంను జిల్లా ఎస్పీ శబరీష్ అభినందించారు.



